కిడ్నీ లో రాళ్లు హోమియో చికిత్స
మూత్ర పిండాలలో ఏర్పడే రాళ్లకు సరైన చికిత్స అందించకపోతే వాటి పని తీరు మందగించి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. అందువలన ఆరోగ్యం దిగజారుతుంది. సకాలంలో హోమియో చికిత్స అందిస్తే ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సరిరాక్రమ తక్కువగా ఉండటం, తగినన్ని నీళ్లు త్రాగకపోవటం, కుటుంబ చరిత్ర, స్ధులకాయం,మద్యపానం వంటివి ముఖ్యకారణాలు. ఇక దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పుట్టుకనుండి ఒకటే కిడ్నీ లేదా చిన్న కిడ్నీలు ఉండటం, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడే వారిలోను కిడఁనీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రం తక్కువపరిణంలో రావడం, రక్తస్రావం వల్ల ఎరుపు రంగులో మూత్రవిసర్జన కావడం, కడుపునొప్పి, వికారం, ఆకలి తగ్గడం, మలవిసర్జన అవుతున్నట్లుగా ఉండటం, అకస్మాత్తుగా లేదా తరుచు వాంతులు, జయరాం రావడం వంటివి జరుగుతాయి, రోజు శారీరక వ్యాయామం,నడక,నాలుగు నుండి ఐదు లీటర్లు మంచినీళ్లు తాగడం మద్యపానానికి దూరంగా ఉండటం, యాక్సిలెటు ఎక్కువగా ఉండే పాలకూర టమోటా,సోయాబీన్, చాక్లెటెను పరిమితంగా తీసుకోవటం ద్వారా స్టోన్స్ సమస్యను నివారించవచ్చు లేదా మరింత పెరగకుండా చేయవచ్చు, హోమియో వైద్యం ద్వారా వీటిని శాశ్వతంగా నయం చేయవచ్చు.
No comments:
Post a Comment